1765
Jump to navigation
Jump to search
1765 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1762 1763 1764 - 1765 - 1766 1767 1768 |
దశాబ్దాలు: | 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 29: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్దతుతో, వారి రక్షణతో బెంగాల్ నవాబుగా సింహాసనం పొందిన మీర్ జాఫర్ మరణానికి ఒక వారం ముందు, తన 18 ఏళ్ల కుమారుడు నజ్ముద్దీన్ అలీ ఖాన్ కు పట్టం గట్టి తాను తప్పుకున్నాడు. [1]
- ఏప్రిల్ 26: జర్మన్ ఇంజనీర్ క్రిస్టియన్ క్రాట్‌జెన్‌స్టెయిన్, గాట్ఫ్రైడ్ లీబ్నిజ్ కనుగొన్న అంకగణిత యంత్రాన్ని మెరుగుపరచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ప్రదర్శించాడు. క్రాట్జెన్‌స్టెయిన్ తన యంత్రం నాలుగు అంకెలకు పైన ఉన్న సంఖ్యలతో లెక్కలు చేస్తుందని చెప్పాడు. కాని ఈ యంత్రాన్ని మరింత ముందుకు అభివృద్ధి చెయ్యలేదు. [2]
- మే 26: గ్లాస్గో గ్రీన్ వద్ద మధ్యాహ్నం ఉద్యానవనంలో షికారు చేస్తున్నప్పుడు, స్కాటిష్ ఇంజనీర్ జేమ్స్ వాట్కు ఆవిరి యంత్రం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళే ప్రేరణ కలిగింది. అతను తరువాత ఇలా వివరించాడు, "ఈ ఆలోచన నా మనసులోకి వచ్చింది, ఆవిరి శూన్యంలోకి వెళుతుంది, సిలిండర్ లోకి దూసుకుపోతుంది సిలిండర్‌ను చల్లబరచకుండా ద్రవీభవిస్తుంది. ..నా మదిలో ఈ విషయం మొత్తం రూపుదిద్దుకునేటప్పటికి నేనింకా గోల్ఫ్-హౌస్ అంత దూరం కూడా నడవలేదు." [3]
- ఆగస్టు 16 – అలహాబాద్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం భారతదేశంలో కంపెనీ పాలన యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. [4]
- తేదీ తెలియదు: భారతదేశంలోని నవసారిలో దేశాయ్ అటాష్ బెహ్రాంను స్థాపించారు.
- తేదీ తెలియదు: లియొన్‌హార్డ్ ఆయిలర్, ఆయిలర్ రేఖను కనుగొన్నాడు.
జననాలు
[మార్చు]- తేదీ తెలియదు: జేమ్స్ స్మిత్సన్, బ్రిటిష్ ఖనిజ శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ మరణానంతర స్థాపకుడు (మ .1829) [5]
మరణాలు
[మార్చు]- ఊత్తుక్కాడు వేంకట కవి-కర్ణాటక సంగీత కృతికర్త
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Abdul Majed Khan, The Transition in Bengal, 1756-75: A Study of Saiyid Muhammad Reza Khan (Cambridge University Press, 2007) p69
- ↑ Matthew L. Jones, Reckoning with Matter: Calculating Machines, Innovation, and Thinking about Thinking from Pascal to Babbage (University of Chicago Press, 2016) p133
- ↑ H. W. Dickinson, James Watt: Craftsman and Engineer (Cambridge University Press, 1936) pp36-37
- ↑ Bhattacherje, S. B. (May 1, 2009). Encyclopaedia of Indian Events & Dates. Sterling Publishers Pvt. Ltd. pp. A-96. ISBN 9788120740747. Retrieved March 24, 2014.
- ↑ "Smithsonian History, James Smithson". Smithsonian Institution Archives. Retrieved 28 February 2018.