చొక్కా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Business shirt

చొక్కా (Shirt) భారతదేశంలో ఎక్కువమంది పురుషులు శరీరం పై భాగంలో కప్పుకోవడానికి ధరించే వస్త్రము. సాధారణంగా ప్యాంటుతో బాటు ధరించబడే చొక్కా పంచె, ధోవతి లుంగీల పై కూడా ధరిస్తారు. కొన్ని సందర్భాలలో పైజామాల పై కూడా కుర్తాకి బదులుగా చొక్కాలనే ధరిస్తారు. చొక్కాలకి ఫుల్ స్లీవ్స్ గానీ హాఫ్ స్లీవ్స్ గానీ ఉంటాయి. ఒకప్పుడు ల్యాపెల్ గల చొక్కాలని ధరించిననూ టీ-షర్టులకి పెరిగిన ఆదరణతో ఇప్పుడు వాటి పై ఎవరూ మొగ్గు చూపటం లేదు. కాలరు గల షర్టులనే ఇప్పుడు ధరిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

మొట్టమొదటి చొక్కాగా చెప్పబడుతున్న వస్త్రాన్ని ఒక ఆంగ్లేయ పురాతత్వ శాస్త్రవేత్త అయిన ఫ్లిండర్స్ పేట్రీ ఈజిప్టులోగల టార్కాన్ అనే ప్రదేశంలో ఒక సమాధి వద్ద కనుగొన్నాడు. ఇది క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు.[1]

చొక్కాలలో రకాలు

[మార్చు]
వివిధ రకాలైన చొక్కాలు
  • ఇంగ్లీష్ షర్ట్: ఇవి మొదటి తరం షర్టులు. ఇవి ఇప్పుడు వేసుకొనే మామూలు షర్టు వలెనే కానీ బొత్తాలు మాత్రం టి-షర్టు లకు ఉన్నట్టు ఛాతీ వరకు మాత్రం ఉండేవి. వీటి ధారణ కూడా టి-షర్ట్ ధారణ వలెనే ఉండేది. వెనుక ప్లీటులు వీపు మధ్య భాగం వద్ద దగ్గరగా కాకుండా బాగా ఎడంగా ఉండేవి. ధరించే సమయంలో ఇస్త్రీ నలిగే అవకాశం ఎక్కువగా ఉండటం, ధరించే విధానం కష్టతరంగా ఉండటం వంటి వాటి వలన తర్వాతి కాలంలో అమెరికన్ షర్ట్ లు జనాదరణ పొందాయి. ప్రస్తుతం ఇంగ్లండు వారు కూడా అమెరికన్ షర్ట్ల పైనే మొగ్గు చూపటం విశేషం.
  • అమెరికన్ షర్ట్: కాలరు వద్ద నుండి క్రింద వరకు బొత్తాలు కలది. ఇంగ్లీష్ షర్ట్ తో పోలిస్తే వీటి వినియోగం, ధారణ, ఇస్త్రీ సులభం. అమెరికన్ షర్ట్ వచ్చిన తర్వాత షర్టులలో (కాలరులలో తప్పితే) పెద్ద తేడాలు కనబడలేదు. బిగుతు షర్ట్ లకి చిన్న కాలర్లు, బెల్ బాటం ప్యాంట్ల కాలంలో చాలా పెద్ద (భుజాల వరకు వచ్చే పాయింటెడ్, రౌండెడ్) కాలర్లు, ప్యారలెల్ ప్యాంట్ల సమయంలో బటన్ డౌన్ కాలర్ల వంటి స్వల్ప మార్పులు మాత్రం కనబడ్డాయి.
  • ఫుల్ స్లీవ్స్ చొక్కా: చేతులు ముంజేయి వరకు ఉన్నాయి. సూటు లోక్ దీనినే వాడతారు.
  • హాఫ్ స్లీవ్స్ చొక్కా: చేతులు మోచేయి వరకు మాత్రమే ఉన్నాయి. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సూటు, కోటు వేసుకోని సమయంలో వాడతారు. వదులుగా ఉన్న హాఫ్ స్లీవ్స్ చొక్కా, చేతులు ఎత్తినప్పుడు స్లీవ్స్ లో నుండి చంక భాగము కనిపించటం కొందరికి ఇష్టం లేక ఫుల్ స్లీవ్స్ నే వాడతారు. కానీ ఉష్ణదేశాలలో హాఫ్ స్లీవ్స్ యే సాకర్యము.
  • టీషర్ట్:: కాలర్ లేకుండా సాగే స్వభావం గల నూలుతో తయారు చేసిన చొక్కా. కొన్నింటికి బొత్తాలు అసలు ఉండవు. కొన్నింటికి ఉంటాయి. వీటిలోను మరల ఫుల్స్ స్లీవ్స్, హాఫ్ స్లీవ్స్ యే కాకుండా, స్లీవ్ లెస్ టీ-షర్ట్ లు కూడా ఉన్నాయి.
  • నైట్ షర్ట్::రాత్రి వేళల్లో నిదురించే సమయంలో వేసుకొనే గౌను వలె ఉన్న షర్ట్. ఇది మోకాళ్ళ వరకు, అంతకంటే క్రిందకు, కాళ్ళ కదలికకి అడ్డు పడకుండా వదులుగా ఉంటుంది.
  • పెల్టియర్‌ కోటు: నిప్పులు చెరిగే ఎండైనా.. ఎముకలు కొరికే చలైనా ఆ కోటు ముందు బలాదూర్‌.ఇది మైనస్‌ 30 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ వరకూ తట్టుకుంటుంది. శరీర ఉష్ణోగ్రతను 18 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంచుతుంది. క్రాంతికిరణ్‌ ఈ జాకెట్‌ను తయారుచేశారు. రెండు వేర్వేరు లోహాలను స్వల్ప విద్యుత్‌ప్రవాహంతో కలిపి ఉష్ణోగ్రతల్లో తేడాలను సాధించవచ్చని 1834లో పెల్టియర్‌ గుర్తించారు. జాకెట్‌ బరువు 650 గ్రాములు. (ఈనాడు 11.3.2010)
  • బుష్ షర్ట్: ముతక నూలుతో అసాంప్రదాయికంగా (ప్రత్యేకించి వేటకి వెళ్ళేటప్పుడు) వేసుకోవటానికి రూపొందించిన షర్టు. ఇప్పటి తరం ధరించే జీన్స్ పైకి వాడే షర్టులని బుష్ షర్ట్ అనవచ్చును. ఇది హాఫ్ స్లీవ్స్ కలిగి ఉంటుంది. భుజాల వద్ద బెల్టు లూపుల వంటి వాటిని, ఒక జేబే కాకుండా ఛాతీకిరువైపులా ఒక్కో జేబుని, వాటికి ఫ్ల్యాప్ లని, స్లీవ్ వద్ద ఒక మడతని, V ఆకారంలో కత్తిరింపు ని, పై వాటన్నిటికీ బొత్తాలని కుట్టబడి ఉంటుంది. కుర్తాకి నడుముకిరువైపులా వెంట్లు ఉన్నట్టు దీనికి కూడా ఉండవచ్చును.
  • మనీలా షర్ట్:ప్రస్తుతం వీటిని ఎవరూ వాడటం లేదు

చొక్కా లోని భాగాలు

[మార్చు]

సాధారణంగా చొక్కాకి గొంతు చుట్టూ సందర్భానుసారము టై గానీ బౌ టై గానీ కట్టుకునే వీలు ఉండే భాగాన్ని కాలరు అంటారు. పూర్వం కాలరు గల షర్టులని సాంప్రదాయికాలుగా వాడగా, ల్యాపెల్ గల షర్టులని అసాంప్రదాయికాలుగా వాడేవారు. ప్రస్తుతం టీ-షర్టుల వాడకం పెరగటంతో ల్యాపెల్ గల షర్టుల వాడకం తగ్గినది. (టీ-షర్టులకి ఉండే కాలర్ కూడా ఒక రకమైన ల్యాపెల్ యే). అసాంప్రదాయికంగానూ వినియోగించవచ్చిననూ, కాలరు హుందాతనానికి చిహ్నం. కొన్ని సంస్థలలో కాలరు లేని షర్టులు నిషిద్ధం.

ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ టర్న్‌డ్ అప్ కాలర్ (కాలర్ ని క్రిందకి మడచకుండా పైకే నిలబెట్టే శైలి) లో అప్పుడప్పుడూ కనబడతారు.

వివిధ రకాలైన కాలర్లు

[మార్చు]

ల్యాపెల్

[మార్చు]

కోటుకు వలె షర్టుకి చిన్న ల్యాపెల్ ఉండవచ్చును. ఇది అసాంప్రదాయికం. టై, బౌ కట్టలేరు. టి-షర్టుల వినియోగం పెరిగినందువలన, ప్రస్తుత కాలంలో షర్టులకి ల్యాపెల్ వినియోగం తగ్గినది.

జేబులు

[మార్చు]

సాధారణంగా షర్టులకి ఛాతీ ఎడమ వైపుకు ఒక జేబు ఉంటుంది. పెన్ను వంటి వస్తువులను భద్రపరచుకోవటానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే, జేబు అసలు ఉండాలా వద్దా (ఉదాహరణకి కోటు, సూటు, బ్లేజరు లకి జేబులు ఉంటాయి కాబట్టి, అవి వేసుకొనేవారికి అవసరం లేదు), ఒక్కటే ఉండాలా, రెండు ఉండాలా అనేవి ధరించేవారి వ్యక్తిగత అభిరుచులు

స్లీవ్స్

[మార్చు]
1991 లో విడుదలైన గ్యాంగ్ లీడర్ చిత్రంలో మోచేతుల వరకు ఉన్న బ్యాగీ షర్టు ధరించిన చిరంజీవి

చొక్కాకు ఉన్న చేతులని స్లీవ్స్ అంటారు. ఇవి రెండు రకాలు

  • ఫుల్ స్లీవ్స్: భుజాల నుండి ముంజేయి వరకు ఉండే చేతులు. సూటు లోపల వీటినే వాడతారు. సూటుకి ఉండే స్లీవ్స్ పొడవు కంటే షర్టుకి ఉండే స్లీవ్స్ కొద్దిగా పొడవుగా ఉంటాయి. సూట్ వేసుకొన్నప్పుడు షర్ట్ కఫ్స్ అందుకే బయటపడుతుంటాయి.
  • హాఫ్ స్లీవ్స్: మోచేతుల వరకు లేదా (ఫ్యాషన్ ని, వ్యక్తిగత అభిరుచులని బట్టి) కొద్దిగా పైకి/క్రిందకి ఉండే స్లీవ్స్. వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో, సూట్ వేయని సందర్భాలలో వీటిని వాడతారు. టైట్ షర్టులకి పొడువు తక్కువగా ఉండే స్లీవ్స్ ని, వదులు షర్టులకి పొడవుగా ఉండే స్లీవ్స్ వాడతారు.

కఫ్ లు

[మార్చు]

కఫ్ అనగా ఫుల్ (స్లీవ్స్) షర్టుకు ముంజేతి వద్ద ఉన్న భాగము. షర్టులకి ఇది రెండు రకాలు

  • బటన్ కఫ్ లేదా బ్యారెల్ కఫ్: బొత్తా ఉపయోగించేది. ఎక్కువగా వాడబడేది
  • లింక్ కఫ్: కఫ్ లింకు ఉపయోగించేది. ఒకప్పుడు వాడేవారు. కానీ ప్రస్తుతము దీని వాడకము తగ్గినది. . లింక్ కఫ్ లు మరల రెండు రకాలు
    • సింగిల్ కఫ్: బటన్ కఫ్ యే కానీ కఫ్ లింకులు ఉపయోగించేది.
    • డబుల్ కఫ్ లేదా ఫ్రెంచి కఫ్: డబుల్ కఫ్ లని వెనక్కి మడచి కఫ్ లింకులు పెట్టవలెను

పోర్టోఫినో లేదా జేంస్ బాండ్ కఫ్ అని ఇంకొక రకము ఉన్ననూ ప్రస్తుతకాలము భారతదేశంలో బటన్ కఫ్ నే వాడుతున్నారు. డబుల్ కఫ్ లు ఒకప్పుడు వాడేవారు కానీ ఇప్పుడు వీటి వాడకం తగ్గినది.

వివిధ రకాల కఫ్ ల చిత్రమాలిక

[మార్చు]

ప్లీట్లు

[మార్చు]

వెనుక భాగం వెన్నుపాముకి ఇరువైపుల గానీ బాగా ఎడంగా కానీ (భుజాల వెనుక వైపు) నకి రెండు ప్లీట్లు చొక్కాలకి ఉండవచ్చును. ఇవి ఒకదానికి ఇంకొకటి వ్యతిరేక దిశలలో ఒక పెట్టె ఆకారం వచ్చేలా ఉంటాయి. అందుకే వీటిని బాక్స్ ప్లీటులు అంటారు. ఇవి లేకున్నను పెద్ద నష్టం ఉండదు. కానీ వంగినప్పుడు వీపు విస్తరణ చెందినప్పుడు ఈ ప్లీట్లు మరింత ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి.

చొక్కాలు-రాజకీయాలు

[మార్చు]

ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో గారీబాల్డీ తన సైన్యానికి రెడ్ షర్ట్స్ (ఎర్ర చొక్కాలు) అని పేరు పెట్టాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Barber, Elizabeth Wayland (1994). Women's Work. The first 20,000 Years, p.135.Norton & Company, New York. ISBN 0-393-31348-4
"https://te.wikipedia.org/w/index.php?title=చొక్కా&oldid=3878076" నుండి వెలికితీశారు