take
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to receive తీసుకొనుట, పుచ్చుకొనుట.
- he took a coach-manబండివాణ్ని పెట్టుకొన్నాడు, అనగా కొలువులో పెట్టుకొన్నాడు.
- he took an impression of the seal ఆ ముద్రతో ముద్ర వేసినాడు.
- I took him along with me నాతో కూడాపిలుచుకొని పోయినాడు.
- he took them aside and gave them this adviceవాండ్లను అవతలికి పిలుచుకొనిపోయి యీ బుద్ధి చెప్పినాడు.
- he took her in marriageదాన్ని పెండ్లాడినాడు.
- she took the child over the bridge ఆ బిడ్డను వారధిదాటించినది.
- he took me through the wood నన్ను అడివి దాటించినాడు.
- you maytake your own time in paying the money నీకిష్టమయినప్పుడు చెల్లించవచ్చును.
- it will take ten days to finish this యిది ముగియడానకు పది దినాలు పట్టును.
- it will take ten rupees to repair the box ఆ పెట్టెను చక్కపెట్టడానకు పది రూపాయలుపట్టును.
- it will take much time దీనికి నిండా కాలము పట్టును.
- it will take much timeదీనికి నిండా కాలము పట్టును.
- they take the fish in baskets చేపలను వూతలలోపట్టుతారు.
- the seize, to catch పట్టుకొనుట, లంకించుకొనుట.
- they took the thief ఆ దొంగను పట్టుకొన్నారు.
- he does not think God will take account of this దీన్నిదేవుడు విచారించునని వాడు యెంచలేదు.
- he took their advice వాండ్ల బుద్ధి విన్నాడు.
- he took aim and shot the bird వాడు గురిపెట్టి ఆ పక్షిని వేసినాడు.
- he took an airing గాలిసవారి పోయినాడు.
- he stopped to take breath వూపిరి తిప్పుకోవడమునకైనిలిచినాడు.
- to take care జాగ్రతగా వుండుట.
- take care భద్రము.
- he took care of his children బిడ్డలను విచారించుకొన్నాడు, బిడ్డలను తన విచారణలో వుంచుకొన్నాడు.
- she does not take care of her children అది తన బిడ్డల జోళి విచారించదు.
- I will take my chance of finding him at home వాడు యింట్లో వుండునేమో చూతాము.
- he took cold వానికి జలుబు చేసినది.
- he took counsel with them వాండ్లతో ఆలోచించినాడు.
- what course did they take ? వాండ్లేదోవ పట్టి పోయినారు, వాండ్లు యేపని చేసినారు.
- he took a dislike to her వాడికి దాని మీద అసహ్యము పుట్టినది.
- he took a drink of water కొంచెము నీళ్ళు తాగినాడు.
- the poison did not take effect ఆ విషమెక్కలేదు.
- as the spell did not take effect upon him యీ మంత్రము వాడిమీదపారలేదు గనక.
- he took the field యుద్ధానికి బయిలుదేరినాడు.
- to take fireరగులుకొనుట.
- they took fight పారిపోయిరి.
- the birds took flight పక్షులుయెగిరిపోయినవి.
- he took fright at the sight of a snake పామును చూచిభయపడ్డాడు.
- he took heart ధైర్యము తెచ్చుకొన్నాడు.
- he took heed to his conduct జాగ్రతగా నడుచుకొన్నాడు.
- he took the hint I gave and went awayనేను చేసిన జాడ తెలుసుకొని పోయినాడు.
- to take hold of పట్టుకొనుట.
- he took hold of her hand దాని చెయిపట్టుకొన్నాడు.
- he took a jump or skip వొక గంతు వేసినాడు.
- he took a kiss ముద్దు పెట్టుకొన్నాడు.
- he took the law of me నా మీదవ్యాజ్యము తెచ్చినాడు.
- when he took leave తాను శలవు పుచ్చుకోగానె.
- may I take the liberty to tell you one thing ? నేను అమర్యాదగా వొకటి చెప్పుతానుక్షమించవలెను.
- never take the liberties అమర్యాద చేయరాదు.
- the painter took his likeness very well చిత్రకారుడు వాణ్ని సరిగ్గా వ్రాసినాడు.
- they take their meals in this place యీ స్థలములో భోజనము చేస్తారు.
- he does not take my meaning right వాడు నా భావము సరిగ్గా గ్రహించలేదు.
- do you take ? నీకు అథర్మమైనదా, నీకుభావము తెలిసినదా.
- he took the measure of the stone ఆ రాయిని కొలిచినాడు.
- he took measures to do this దీన్ని చేయడమునకు వుపాయములు వెతికినాడు.
- he took the medicine ఆ మందు తిన్నాడు.
- he took a mouthful బొక్కెడు తిన్నాడు.
- he took his uncles name మామ పేరు పెట్టుకొన్నాడు.
- he took no notice of us ఆయన మమ్మున కండ్లెత్తి చూడ లేదు.
- he took an oath ప్రమాణము చేసినాడు.
- he took occasion to say this సమయము చూచుకొని యీ మాట చెప్పినాడు.
- he took offence at this దీని మీద అసహ్యము వచ్చినది.
- he took the opportunity to say this సమయము చూచుకొని యీ మాట చెప్పినాడు.
- he took pains to master it దాన్ని సాధించడమునకై బహు ప్రయాసపడ్డాడు.
- he took my part నాపక్ష మైనాడు.
- God took their part వాండ్లకు దైవ సహాయము వుండినది.
- you must take patience నీకు తాళిమి వుండవలసినది.
- he took pity upon them వాండ్లను గురించిజాలిపడ్డాడు.
- to take place కలుగుట, సంభవించుట.
- a marriage took place పెండ్లితటస్థమైనది.
- if elision takes place లోపము వస్తే.
- a suit cannot take placeవ్యాజ్యము రారాదు.
- what more took place ? యింకా యేమి సంభవించినది, యింకాయేమి జరిగినది.
- he takes a pride in doing this యిది చేయడము వాడికి వొక గర్వము.
- they took a resolution వొక నిశ్చయము చేసిరి.
- to take revenge పగదీర్చుకొనుట.
- the plant did not take root ఆ చెట్టుకు యింకా వేళ్లు పారలేదు.
- these words took root in his mind యీ మాటలు వాని మనస్సులో పాదుకొన్నవి or నాటుకొన్నవి.
- he took a run and leapt over the well పరుగెత్తి ఆ బావి దాటినాడు.
- take a seatకూరర్చుణ్నుండి.
- to take shame సిగ్గుపడుట.
- the demon took the shape of a horse ఆ రాక్షసుడు అశ్వరూపమును వహించినాడు.
- he took shelter there అక్కడదాగినాడు.
- he took ship వాడ యెక్కినాడు.
- he took snuff పొడి వేసుకొన్నాడు, పొడిపీల్చినాడు.
- why should you take thought about this ? యిందున గురించి యేలవిచారపడుతావు.
- come and take turn in the garden వచ్చి తోటలో తిరుగు.
- she took the veil కాషాయాలు పుచ్చుకొన్నది, సన్యసించినది.
- he took a view of the village from the hill ఆ కొండ మీద నుంచి ఆ వూరిని బాగా చూచినాడు, ఆ కొండ మీద నుండి ఆ వూరివలె కాకితము మీద వ్రాసినాడు.
- he took a voyage వాడ యెక్కి పోయినాడు.
- the dog took the water or took to the water కుక్క నీళ్ళలో దుమికి యీదినది.
- he took his may దోవ బట్టినాడు, he took a wife పెండ్లి చేసుకొన్నాడు.
- he took her to wife దాన్ని పెండ్లాడినాడు.
- the story took wind ఆ కథ బయిట పడ్డది.
- I took his word and went there వాడి మాట నమ్మి అక్కడికి పోతిని.
- he took them at their word వాండ్ల మాట పట్టుకొని వాండ్లనే చెరిపినాడు.
- he took it ill యిది అన్యాయముగా యెంచినాడు, I take it he is wrong వాడు తప్పినట్టు నాకు తోస్తున్నది.
- I took it in another sense నేను వేరే అర్థము చేసుకొన్నాను.
- I take it he went పోయినాడని తోస్తున్నది.
- he will take it very kindly if you go there నీవు అక్కడికి పోతే వాడికి సంతోషముగా వుండును.
- he took it very unkindly that you should say this నీవు యీ మాట అనడమువల్ల వాడికి నిండా అసహ్యము వచ్చినది.
- he certainly was angry, but ( take this along with you ) he has reason వాడు కోపము చేసినది సరే దానికి హేతువు వున్నది సుమీ.
- it is true that he was in debt, but ( take this along with you ) he has paid his debts వాడు అప్పులు పడ్డది వాస్తవమేకాని ఆ అప్పులను చెల్లించివేసినాడు సుమీ.
- he will take amiss if you speak to his wife వాడి పెండ్లాముతో నీవు మాట్లాడితే నీ మీద వాడికి ఆయాసము వచ్చును.
- why should you take this a miss ? దీనికి యెందుకు ఆగ్రహపడుతావు.
- he took away the chair కూర్చీ అవతలికి తీసుకపోయినాడు.
- to take away a mans bread వొకని కూటిలో రాయి వేసుట.
- God took away her child దేవుడు దాని బిడ్డను తీసుకొని పోయినాడు, అనగా దానిబిడ్డ చచ్చిపోయినది.
- the cold or fright or tickling took away my breath నాకు వూపిరి తిరగక పోయినది, వుడ్డు గుడుచుకొన్నాను.
- he took her by the hand దాన్ని చెయి పట్టుకొన్నాడు.
- he took it by force of my hands నా చేతులో నుంచి దాన్ని తీసుక్కొన్నాడు.
- they took down the beam దూలమును దించినారు.
- he took down what they said వాండ్లుచెప్పినదాన్ని వ్రాసుకొన్నాడు, will take down his pride వాడి కొవ్వును అణుస్తాను.
- they took down the roof of the house ఆ యింటి పై పూరిని విచ్చివేసినారు.
- they took down the wall ఆ గోడను పడగొట్టినారు.
- to suppose యెంచుకొనుట,అనుకొనుట.
- I took the tree for a man చెట్టును చూచి మనిషి అనుకొంటిని.
- I took the wood for stone ఆ కొయ్యను చూచి రాయి అనుకొంటిని.
- I took it for granted he would come వాడు వచ్చుననుకొంటిని.
- you must pay for it; I take it for granted that you have the money దానికి నీవు రూకలు చెల్లించవలసినది నీదగ్గర రూకలు వుండవలెను.
- I was a stranger and he took me in నేనుపరదేశస్థుణ్ని అయినందున నాకు తన యింట్లో స్థలము యిచ్చినాడు.
- he took me in about this horse యీ గుర్రము విషయములో నన్ను మోసబుచ్చినాడు.
- after he took the work in hand ఆ పనికి మొదలుపెట్టిన తర్వాత, పూనుకొన్న తర్వాత.
- he takes in the gazette వాడికి నిత్యము సమాచార పత్రిక వస్తున్నది.
- he took in a piece of ground కొంత నేలను తన నేలతో చేర్చుకొన్నాడు.
- he took in sail వాడ చాపనుదించినాడు.
- thou shalt not take Gods name in vain వృథాగా దేవుడి పేరు యెత్తరాదు.
- they took it into consideration దీన్ని విమర్శించినారు.
- he took this into his head that I was his enemy నేను తనకు శత్రువునని పిచ్చిగా అనుకొన్నాడు, భ్రమపడ్డాడు.
- he took her into his arms దాన్ని కౌగలించుకొన్నాడు, ఆలింగనము చేసుకొన్నాడు.
- he took the law into his own hands దివాణము మూలకముగా కాకుండా తానే శిక్ష చేసినాడు.
- to take off తీసివేసుట, విడిచివేసుట, వీడ్చుట.
- he took off his clothes బట్టలు విడిచివేసినాడు.
- he took off the tigers skin పులి తోలును దోచినాడు.
- a fever took him off జ్వరము వాణ్ని కొంచపోయినది.
- the boy took off his fathers way of walking ఆ పిల్ల కాయ తండ్రివలె యెగతాళిగా నడిచినాడు.
- the school boy took off his masters way of talking పల్లె కూటపు పిల్లకాయ వుపాధ్యాయులవలె యెకసక్యముగా మాట్లాడినాడు.
- take off your hands చేతులు అవతలికి తియ్యి.
- I took it off his hands అతని వద్ద కొనుక్కొన్నాను.
- to take off an impression అచ్చువేసుట, ముద్ర వేసుట.
- they took off a thousand impressions of the book వెయ్యి ప్రతులు అచ్చువేయించినారు.
- he took himself off i.
- e.
- he went away వాడు వెళ్ళినాడు.
- he took the ring off his finger తన వేలి వుంగరమును తీసినాడు.
- he took off his hat తల మీది టోపిని చేత తీసుకొన్నాడు.
- the surgeon took off his leg వయిద్యుడు వాని కాలు కోసివేసినాడు.
- she took on very much about this యిందున గురించి చాలా వ్యసనపడ్డది.
- he took out the nail ఆ చీలను పెరికినాడు, వూడదీసినాడు.
- he took the loom to pieces ఆ మగ్గమును వేరే వేరేగా వీడ్చివేసినాడు.
- this took the pride out of them యిందువల్ల వాండ్లకు గర్వభంగమైనది.
- taking these things together I believed the story వీటినంతా యోచించి ఆ మాటను నమ్మినాను.
- the bearers took up the palanqueen బోయీలు పాలకీని యెత్తుకొన్నారు.
- he took me up very angrily నా మీద కోపము చేసినాడు, చీవాట్లు పెట్టినాడు.
- they took the matter up ఆ సంగతిని విమర్శ చేసినారు.
- to take up quarters దిగుట, బసచేసుట.
- he took up his quarters in the lodge చావట్లో దిగినాడు.
- he took too much upon himself నిండా గర్వించినాడు.
- I will take upon myself to say that they are wrong వాండ్లు తప్పినారు అందుకు నేను వున్నాను these goods took very well here యీ సరుకులు యిక్కడ బాగా అమ్ముడుబోతవి.
క్రియ, నామవాచకం, ప్రవర్తించుట, పట్టుట.
- he took to the study very kindly నిండాఆశగా చదివినాడు.
- he took to the church పాదిరి అయినాడు, పాదిరి వుద్యోగములోప్రవేసించినాడు.
- he took to the road or he ran away దారి కొట్టి దోచే దొంగఅయినాడు, పారిపోయినాడు.
- he took to the hill కొండతట్టుకై పారిపోయినాడు,వేటకు పోయినాడు.
- the child took to him ఆ బిడ్డ వాని మీద ఆశగా వున్నది.
- the boy did not take to his book వానికి చదువు మీద ఆశ లేదు.
- he has taken to the bottle తాగడములో పడ్డాడు.
- he took to his heels పారిపోయినాడు, వురికినాడు.
- he took to his bed మంచమెక్కినాడు, రోగము వచ్చి పడుకొన్నాడు.
- the cat took to a tree ఆ పిల్లి చెట్లో దాగుకొన్నది.
క్రియ, విశేషణం, (add,) In page 1176.
- He took the words out of my mouth నేను ఆ సంగతి అనవస్తే అతడు అ మాటలు తానేచెప్పినాడు, నేను చెప్పబొయ్యేమాట తానే అందుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).